NZB: బాల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిట్టాపూర్ శివారులోని డంపింగ్ యార్డ్ సమీపంలో పేకాట స్థావరంపై గురువారం రాత్రి పోలీసులు దాడి చేశారు. పేకాట ఆడుతున్న 8 మంది జూదరులను అరెస్టు చేసి, వారి నుంచి రూ. 4,500 నగదుతో పాటు 8 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై శైలేందర్ తెలిపారు. కేసును నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.