SRD: విద్యారంగానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. అందోలు పాలిటెక్నిక్ కళాశాలలో కళాశాలల అభివృద్ధిపై సమావేశం మంగళవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని పాఠశాలలు, కళాశాలలోని సమస్యలపై పరిశీల చేసి నివేదిక సమర్పించాలని చెప్పారు. అన్ని కళాశాలలో వసతులు కల్పించేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.