HYD: జీహెచ్ఎంసీలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్లు, వారితో సమాన స్థాయి హోదా ఉన్న 97 మందికి సూపరింటెండెంట్లుగా పదోన్నతులు కల్పిస్తూ జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ ప్రొసీడింగ్స్ జారీ చేశారు. జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఆమోదం మేరకు తాత్కాలిక పదోన్నతి కల్పించినట్లు ఆయన పేర్కొన్నారు.