WGL: పారిశుద్ధ్య కార్మికులకు నిత్యం అండగా ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని 62వ డివిజన్ కార్పొరేటర్ జక్కుల రవీందర్ యాదవ్ అన్నారు. డివిజన్లోని పారిశుద్ధ్య కార్మికులకు కార్పొరేటర్ చలికోట్లను పంపిణీ చేశారు. చలి తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో పారిశుద్ధ్య కార్మికులు తగిన జాగ్రత్తలు పాటించాలని కార్పొరేటర్ సూచించారు.