నల్లగొండ పట్టణంలోని రెడ్డి కాలనీలో నివాసం ఉంటున్న మహేష్ బుధవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో, ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు వన్ టౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డి తెలిపారు. మృతుడు త్రిపురారం మండల ఎంపీడీవో కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నట్లు తెలిపారు. ఆతడి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.