MDK: జిల్లాలోని జూనియర్ కళాశాలలకు ఈనెల 28 నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు దసరా సెలవులను ప్రభుత్వం ప్రకటించిందని మెదక్ జిల్లా ఇంటర్ అధికారి విజయలక్ష్మి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. సెలవుల్లో ప్రవేట్ జూనియర్ కళాశాలలో తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ విషయాన్ని అన్నీ జూనియర్ కళాశాలల ప్రిన్సిపల్స్ గమనించాలని సూచించారు.