MDK: ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ప్రవేశాల గడువును ఈనెల 31వ తేదీ వరకు పొడిగించినట్లు జిల్లా ఇంటర్ అధికారి మాధవి తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు నేరుగా తమకు నచ్చిన కళాశాలలకు వెళ్లి దరఖాస్తులు చేసుకోవచ్చని ఆమె సూచించారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని వృథా చేయకుండా సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.