NDL: నంద్యాల నుంచి కర్నూలుకు వెళుతున్న శివజగదీష్ (22) అనే యువకుడు గురువారం సాయంత్రం తన బంధువులతో కలిసి పాణ్యం సమీపంలోని ఎస్సార్బీసీలో స్నానం చేయడానికి దిగాడు. ప్రవాహ వేగానికి ఇద్దరు కొట్టుకుపోతుండగా, స్థానిక హమాలీలు ఒకరిని కాపాడారు. అయితే, శివజగదీష్ జాడ ఇంకా తెలియరాలేదు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.