KDP: ముఖ్యమంత్రి సహాయనిది పేదలకు వరం అని పులివెందుల జడ్పీటీసీ సభ్యురాలు మారెడ్డి లతారెడ్డి అన్నారు. ఇందులో భాగంగా పులివెందులలోని తెదేపా కార్యాలయంలో సోమవారం 212 మంది లబ్దిదారులకు రూ. 1.08 కోట్లు విలువైన చెక్కులను ఆమె పంపిణీ చేశారు. అనంతరం బాధితులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.