KDP: దేవుని కడప శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో దర్శనాలు ప్రారంభమయ్యాయి. ఆలయం పునర్నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో ప్రధాన ఆలయంలో దేవుడి దర్శనాలు నిలిపేశారు. నూతన బాలాలయం ఏర్పాటు చేసి అందులో స్వామి, అమ్మవారికి పూజలు జరుగుతున్నాయి. ఇందులో ప్రతిష్ఠించిన స్వామి, అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులను అనుమతిస్తున్నారు.