KDP: సోషల్ మీడియా వినియోగంపై విద్యార్థులు తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని బద్వేలు ఎస్సై జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం బద్వేలులోని జిల్లా పరిషత్ బాయ్స్ హైస్కూల్లో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇంటర్ నెట్ ద్వారా ఎంత మంచి జరుగుతుందో అంతే స్థాయిలో చెడుకు కూడా అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని ఎస్సై జగదీశ్వర్ సూచించారు.