WGL: ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విద్యుత్ శాఖ అధికారులు ఇవాళ కీలక సూచనలు జారీ చేశారు. కరెంట్ పోల్స్, వైర్లను ముట్టుకోవద్దని, మహిళలు బట్టలు ఆరేసేటప్పుడు ఇనుప తీగల విషయంలో జాగ్రత్త వహించాలని సూచించారు. శిథిలమైన ఇళ్లలో ఉండొద్దని, తడిగా ఉన్న గోడలను ముట్టుకోవద్దని, ట్రాన్స్ఫార్మర్ల వద్దకు వెళ్లకుండా చూడాలని హెచ్చరించారు.