ASR: పర్యాటక కేంద్రమైన చాపరాయి జలపాతంలో వాహనాల పార్కింగ్ వసూళ్లకు టెండర్ పాట నిర్వహించాలని వైసీపీ పోతంగి పంచాయతీ అధ్యక్షుడు కె. విజయదశమి డిమాండ్ చేశారు. శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ.. గతంలో టెండర్ వ్యవస్థ వల్ల పంచాయతీకి ఆదాయం వచ్చేదని, ప్రస్తుతం ఐటీడీఏ నిర్వహణ కారణంగా నిధులు రావడం లేదన్నారు.