KMM: కామేపల్లి మండలం జగన్నాథతండాలో శుక్రవారం నూతన అంగన్వాడి కేంద్రం భవన నిర్మాణానికి ఎమ్మెల్యే కోరం కనకయ్య శంకుస్థాపన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీ, బాలింతలు, పిల్లలకు పోషకాహారం అందిస్తుందని చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో మండల అధికారులు పాల్గొన్నారు.