WGL: వరంగల్ కమిషనరేట్లో పదోన్నతి పొందిన 10మంది ఎస్సై లను కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ అభినందించారు. పదోన్నతులు పెరిగితే బాధ్యతలు కూడా పెరుగుతాయని వార సూచించారు. నిజాయితీగా పనిచేయాలని, బాధితులకు భరోసా కల్పించి నిరుపేదలకు అండగా నిలవాలని కోరారు. క్యాంపు కార్యాలయంలో కలిసిన ఎస్సై లకు నక్షత్రాలు అలంకరించి వారికి శుభాకాంక్షలు తెలిపారు.