JGL: మల్యాల మండలం ముత్యంపేటలోని కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ హుండీ ఈనెల 5న లెక్కించనున్నట్లు ఆలయ ఈవో శ్రీకాంత్ రావు తెలిపారు. హుండీ లెక్కింపులో ఔత్సాహిక భక్తులు పాల్గొనవచ్చని అన్నారు. అనంతరం పాల్గొన్నవారికి తీర్థ ప్రసాదాలు అందజేయడం జరుగుతుందని పేర్కొన్నారు.