BDK: మణుగూరు మండలంలో ఉపాధి హామీ పథకం కింద చెరువులు, కుంటలు, పంట పొలాల కాలవల పూడిక తీయాలని మంగళవారం సామాజిక కార్యకర్త కర్నె రవి ఎంపీడీవో శ్రీనివాస్‌కు వినతి పత్రం అందజేశారు. చెరువుల కింద ఎంతో మంది రైతులు పంటల సాగు చేస్తున్నారని, పూడిక తీయడం వల్ల నీటి నిల్వ పెరిగి పంటలకు అధిక దిగుబడి లభిస్తుందని, దీని ద్వారా రైతులకు మేలు జరుగుతుందని వారు పేర్కొన్నారు.