HYD: తెలంగాణపై సోషిల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తనయుడు బీఆర్ఎస్ నేత కార్తీక్ రెడ్డి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గత కొన్నిరోజులుగా సోషల్ మీడియా వేదికగా రాష్ట్రంపై దుష్ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధ్యులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.