ASF: MCPIU పార్టీ వ్యవస్థాపక నేత, మాజీ ఎమ్మెల్యే కామ్రేడ్ మద్దికాయల ఓంకార్ శతజయంతి వార్షికోత్సవం గోడపత్రులను ఆసిఫాబాద్ నియోజవర్గ సభ్యురాలు కోవా లక్ష్మి బుధవారం ఆవిష్కరించారు. ఆమె మాట్లాడుతూ.. ఓంకార్ ఎమ్మెల్యేగా పని చేసినప్పటికీ ఎలాంటి ఆడంబరాలకు తావు లేకుండా సామాన్య జీవితం గడిపారు. ప్రజా సేవ కోసమే జీవితం అంకితం చేసిన వ్యక్తి అని కొనియాడారు.