SRD: కలెక్టర్ కార్యాలయంలో నేడు ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు అధికారులు ప్రజల నుంచి నేరుగా వినతి పత్రాలు స్వీకరిస్తారని చెప్పారు. సమస్యలను అక్కడికి అక్కడే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు.