ASF: పార్టీలో కష్టపడే వారికి తప్పక గుర్తింపు లభిస్తుందని రాష్ట్ర గ్రంథాలయ ఛైర్మన్ రియాజ్, DCC అధ్యక్షురాలు సుగుణ అన్నారు. శనివారం కాగజ్ నగరలోని MLC దండే విట్టల్ నివాసంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. జిల్లా కార్యవర్గ విస్తరణలో భాగంగా అభ్యర్ధనలు స్వీకరిస్తామన్నారు. ప్రజాపాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారనడానికి పంచాయతీ ఎన్నికల తీర్పు నిదర్శమన్నారు.