HYD: మూడు విడతల్లో జరగనున్న గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా పోలీసులు పటిష్టమైన ముందస్తు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈ నెల 11, 14, 17 తేదీల్లో జరిగే ఎన్నికల కోసం అన్ని అంశాలపై నిఘా పెట్టామన్నారు. అభ్యర్థులు, మద్దతుదారుల మధ్య ఎలాంటి గొడవలు జరగకుండా ప్రత్యేక దృష్టి సారించామని, ఎన్నికల ప్రకటన వెలువడినప్పటి నుంచి అవగాహన కార్యక్రమాలు, ర్యాలీలు నిర్వహించినట్లు వెల్లడించారు.