SDPT: గజ్వేల్ పరిధిలో ఎలాంటి యూరియా కొరత లేదని, కొందరు పనిగట్టుకొని చేస్తున్న ప్రచారాన్ని రైతులు నమ్మవద్దని గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వంటేరు నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో వారు మాట్లాడుతూ.. కొందరు పనిగట్టుకొని యూరియా పంపిణీపై రాజకీయం చేయడం సిగ్గుచేటని నిలదీశారు.