KNR: స్వచ్ఛభారత్, ఫిట్ ఇండియా మిషన్లో భాగంగా పీఆర్ అండ్ ఆర్డీ డైరెక్టర్ ఆదేశాల మేరకు సిరిసిల్లలో ఆదివారం ‘సండేస్ ఆన్ సైకిల్’ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి రాందాస్ జెండా ఊపి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.