BHPL: మహదేవపూర్ మండల కేంద్రంలో 15 ఏళ్లుగా పిచ్చిమొక్కలతో నిండి మూతపడిన రహదారికి సర్పంచ్ హసీనా బాను అక్బర్ ఖాన్ మరమ్మతులు చేయించారు. బుధవారం జేసీబీతో ముళ్లపొదలు తొలగించి దారిని సుగమం చేశారు. గత పాలకుల నిర్లక్ష్యమే ఈ సమస్యకు కారణమని సర్పంచ్ విమర్శించారు. ఏళ్ల నాటి సమస్య పరిష్కారంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తూ సర్పంచ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.