MDCL: కీసర శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ సందర్శించారు. శివాలయంలో స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పురోహితులు మంత్రికి తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనాలు ఇచ్చారు. దేవాలయ అభివృద్ధి పనులు, యాత్రికుల సౌకర్యాలపై వివరాలు తెలుసుకొని అవసరమైన సహాయం అందిస్తామని తెలిపారు.