JN: రఘునాథపల్లి మండలం బాంజీపేట గ్రామంలోనిలో లెవెల్ కల్వర్టు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పూర్తిగా ధ్వంసం అయింది. దీంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు ఆరోపిస్తున్నారు. సీజన్ కావడంతో పత్తి, వరి ధాన్యాలను తరలించడానికి ఇబ్బంది కలుగుతుందని వాపోయారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు పట్టించుకుని సమస్యను పరిష్కరించాలన్నారు.