HYD: సికింద్రాబాద్ ప్యారడైజ్ నుంచి శామీర్‌పేట్ ఓఆర్ఆర్ వరకు నిర్మించనున్న ఎలివేటెడ్ కారిడార్‌కు సంబంధించి ఈనెల 29న టెండర్ల నోటిఫికేషన్ జారీకి హెచ్ఎండీఏ సిద్ధమైంది. ఈప్రాజెక్టుకు కీలకమైన రక్షణ శాఖ భూముల అప్పగింత కొలిక్కి రావడంతో పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే డైయిరీఫాం కారిడార్ పనులు మొదలయ్యాయి.