జనగామ: యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో జనగామ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులుగా మారబోయిన ప్రకాష్ యాదవ్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారు డీసీసీ అధ్యక్షులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డిని బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కొమ్మూరి ప్రతాప్ రెడ్డి వాళ్ళని శాలువాలు కప్పి శుభాకాంక్షలు తెలియజేశారు.