JGL: పెగడపల్లి మండలం బతికేపల్లి శివారులోని పెద్ద గుట్ట వద్ద ఉపాధి హామీ పనులు నిర్వహిస్తున్న మహిళలకు పురాతన వెండి నాణేలు లభించాయి. మహిళలు ఉపాధి హామీ పనుల్లో భాగంగా భూమి తవ్వకాలు చేస్తున్నారు. బయటపడ్డ పురాతన వెండి నాణేలపై ఉర్దూ భాష ఉందని వాటిని పురావస్తు శాఖ అధికారులకు అప్పగించినట్లు పెగడపెల్లి పోలీస్, రెవెన్యూ అధికారులు తెలిపారు.