NLG: హాలియాలో నిర్మించిన వైకుంఠధామంలో పలు సమస్యలు కొనసాగుతున్నాయి. కొన్ని వసతులు ఇంకా అందుబాటులోకి రాలేదు. అంత్యక్రియల కోసం నిర్మించిన ఘాటు ప్రారంభం కాలేదు. సందర్శకుల కోసం నిర్మించిన భవనం కూడా వినియోగంలోకి రాలేదు.నీటి సౌకర్యం మెరుగుపరచాలని, సమస్యలను అధికారులు పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.