JGL: స్పెషల్ లోక్ అదాలత్లో జగిత్యాల జిల్లా వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న 1861 కేసులను ఇరు వర్గాల సమ్మతితో పరిష్కరించినట్లు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. జిల్లాలో నమోదైన 66 సైబర్ క్రైమ్ కేసుల్లో బాధితులు కోల్పోయిన రూ.20 లక్షలను బ్యాంకుల సహకారం, టెక్నికల్ ట్రాకింగ్, వేగవంతమైన ఫ్రీజింగ్ చర్యలతో తిరిగి రీఫండ్ చేయించామని వివరించారు.