WGL: నల్లబెల్లి మండలంలోని శనిగరం క్రాస్ వద్ద అగ్రోస్ సెంటర్ వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా యూరియా బస్తాలను అందిస్తున్నారు. వ్యవసాయ శాఖ మరియు పోలీస్ శాఖ సంయుక్తంగా చర్యలు చేపట్టి, సరైన క్రమంలో సామాజిక దూరాన్ని పాటిస్తూ యూరియా పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. రైతులు సులభంగా యూరియా అందిస్తున్నట్లు AEO శివకుమార్ తెలిపారు. జిల్లాలో కొంతవరకు పరిస్థితి మారిందని తెలిపారు.