MBNR: రాజ్యాంగ విరుద్ధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన జీవో 29 ని వెంటనే రద్దు చేయాలని బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ సాగర్ డిమాండ్ చేశారు. మహబూబ్ నగర్ సంఘ కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడుతూ.. నిరసన కార్యక్రమాలు చేస్తున్న నిరుద్యోగులు విద్యార్థులపై లాఠీచార్జ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.