SRCL: దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. సోమవారం శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో భక్తులు సుదూర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యల తరలివచ్చారు. సోమవారం పరమశివుని దర్శించుకుంటే సకల శుభాలు జరుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అర్చక స్వాములు, వేద పండితులు ప్రత్యేక పూజ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు.