JNG: రఘునాథపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టారు. మండల పార్టీ అధ్యక్షుడు వారాల రమేష్ యాదవ్ ఆధ్వర్యంలో నిరసన తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా ఎగ్గొట్టిందని, ఎకరానికి 15000 రైతుభరోసా ఇస్తామని చెప్పి, ఇవ్వకుండా మోసం చేసిందని మండిపడ్డారు.