GDWL: రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలు హైదరాబాదులోని ఆయన స్వగృహంలో సోమవారం ఘనంగా జరిగాయి. ఇందుకు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హాజరై మంత్రికి పూల బొకే అందించి, శాలువాతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. గద్వాల నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని కోరారు.