WGL: పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా బ్యాడ్మింటన్ డబుల్స్ పోటీలు నిర్వహించనున్నట్లు పోలీసులు తెలిపారు. పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని తొర్రూర్ సర్కిల్ పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 26, 27 తేదీల్లో తొర్రూర్ పోలీస్ స్టేషన్లో తొర్రూర్ డివిజన్ స్థాయి బ్యాడ్మింటన్ డబుల్స్ పోటీలు నిర్వహించనున్నట్లు నర్సింహులపేట ఎస్సై మాలోతు సురేశ్ తెలిపారు.