WNP: ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుద్ధ్య కార్మికులను నియమించుకోవాలని ఆదేశాలు జారీ చేశామని బుధవారం వనపర్తి జిల్లాలో డీఈఓ డా. గోవిందరాజులు అన్నారు. వారి వేతనాలకు సంబంధించి ప్రభుత్వం నిధులు విడుదల చేసిందన్నారు. మధ్యాహ్న భోజనం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. విద్యార్థులు చేతులు శుభ్రం చేసుకునేలా ప్రధానోపాధ్యాయులు ఏర్పాట్లు చేయాలని అన్నారు.