NLG: నాగార్జున ప్రభుత్వ కళాశాలలో సాంస్కృతిక విభాగం, మహిళా సాధికారికత విభాగం ఆధ్వర్యంలో మంగళవారం బతుకమ్మ సంబరాలు అత్యంత ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డా.ఎస్.ఉపేందర్ మాట్లాడుతూ విద్యార్థులు బతుకమ్మ సంబరాలను సామరస్యంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ప్రపంచంలోనే పూలను పూజించే పండుగ ఇదొక్కటేనని అన్నారు.