ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీ మెడికల్ కాలేజీలో అగ్నిప్రమాదం సంభవించింది. క్రమంగా పెరిగిన మంటలు చిన్నపిల్లల వార్డుకు వ్యాపించాయి. దీంతో ఆ వార్డులో ఉన్న 10 మంది శిశువులు సజీవ దహనమయ్యారు. దీంతో రోగులు, ఆసుపత్రి సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది.. ఆరు అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపు చేస్తున్నారు. కాగా.. ప్రమాదానికి షార్ట్ సర్యూట్ కారణమని అధికారులు భావిస్తున్నారు.