గుజరాత్లో భూకంపం సంభవించింది. గుజరాత్‌లోని మహేసనాలో రిక్టర్ స్కేల్‌పై 4.2 తీవ్రతతో మోస్తరు భూకంపం సంభవించింది. ఈ ప్రకంపనలు రాత్రి 10:15కి సంభవించాయని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. అయితే ప్రాణ నష్టం, ఆస్తి నష్టం గురించి ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం అందలేదు.