AP: అమరావతిలో భూ కేటాయింపులపై మంత్రుల కమిటీ తొలిసారి భేటీ అయింది. ఈ సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడారు. భూములు కేటాయించిన సంస్థల్లో ఎవరు ఆసక్తిగా ఉన్నారని పరిశీలిస్తున్నామని మంత్రి పయ్యావుల తెలిపారు. సీఆర్డీఏ పరిధిలో పనులు జరుగుతున్న కొద్దీ మరిన్ని సంస్థలు వస్తాయని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, కంపెనీలను అమరావతికి తేవడంపై చర్చించామని ఆయన వెల్లడించారు.