ఢిల్లీలో డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టు చేసేందుకు NCB ఆపరేషన్ చేపట్టింది. ఈ సోదాల్లో 80 కిలోల కొకైన్ ను సీజ్ చేశారు. దీని ధర రూ.900కోట్ల విలువ ఉంటుందని తెలిపారు. అధికారుల చర్యలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రశంసించారు. NCB చర్యలను మాదకద్రవ్యాల రహిత భారత్ నిర్మాణంలో కీలక పురోగతి అని షా పేర్కొన్నారు.