JN: జిల్లాస్థాయి అండర్ 19 క్రికెట్ పోటీలకు చేర్యాల మండల కేంద్రానికి చెందిన కర్రోల చరణ్ ఎంకయ్యారు. చేర్యాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న చరణ్ ఇటీవల జరిగిన క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొని ప్రతిభ కనబరిచిన సందర్భంగా జిల్లా స్థాయిలో అతన్ని ఎంపిక చేసినట్లు ప్రిన్సిపల్ జ్యోతి తెలిపారు. కాగా చరణ్‌ను పలువురు అభినందించారు.