KMR: వృద్ధులు ఆరోగ్యవంతంగా ఉంటూ, సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. అంతర్జాతీయ వయో వృద్ధుల దినోత్సవం సందర్భంగా కామారెడ్డి పట్టణంలోని వయో వృద్ధుల ఫోరం భవనంలో కార్యక్రమాన్ని మంగళవరం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. వృద్ధులు ఆరోగ్యవంతంగా ఉండాలని, తరచూ వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.