HYD: రాష్ట్రంలో రవాణా శాఖలో లక్ష్యానికి అనుగుణంగా ఆదాయ మార్గాలను పెంచేందుకు ఎన్‌ఫోర్స్‌మెంటు పెంచాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బుధవారం రవాణా శాఖ అధికారులతో మంత్రి సచివాలయంలో సమావేశాన్ని నిర్వహించారు. స్కూల్ బస్సుల ఫిట్నెస్ విషయంలో కఠినంగా వ్యవహరించాలన్నారు. ఓవర్ లోడ్‌తో విద్యార్థులను తీసుకెళ్తున్న వాహనాలపై అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.