NZB: తపాలా శాఖ ఆధ్వర్యంలో ఆగిపోయిన పిఎల్ఐ, ఆర్పీఎఫ్ పాలసీల పునరుద్ధరణకు ఈ నెల 6 నుంచి 20 వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు జిల్లా ఎస్ఎస్పీ కే. జనార్దన్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో పనిచేసే వారితోపాటు లాయర్లు, ఇంజనీర్లు, డాక్టర్లు, డిగ్రీ చేసిన వారందరూ సైతం ఈ భీమా పాలసీని తీసుకోవచ్చని కోరారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.