WGL: వానాకాలం ధాన్యం కొనుగోళ్ళకు పటిష్ఠ కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో వానాకాలం ధాన్యం కొనుగోలు కార్యాచరణ ప్రణాళిక రూపకల్పనపై వ్యవసాయ, పౌరసరఫరాలు, సహకార, వ్యవసాయ, గ్రామీణాభివృద్ధిశాఖ, తూనికలు, కొలతల శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు.