KMR: ఎల్లారెడ్డి మండలంలో నిన్న కురిసిన భారీ వర్షానికి వరి పంట పొలాలు పూర్తిగా నేలకోరిగాయి. పోసంపల్లి, లక్ష్మాపూర్, అడవి లింగాల్తోపాటు పలు గ్రామాల్లో గాలితో కూడిన వడగండ్ల వర్షం కురుస్తుంది. దీంతో కష్టపడి పండించిన పంట చేతి దాకా వచ్చి నేలపాలయ్యిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆదుకొని నష్టపరిహారం చెల్లించాలని రైతులు కోరారు.